News

Realestate News

హెచ్‌పీసీఎల్‌కు భూగర్భ విద్యుత్తు లైన్లు


హెచ్‌పీసీఎల్‌కు భూగర్భ విద్యుత్తు లైన్ల

హెచ్‌పీసీఎల్‌కు భూగర్భ విద్యుత్తు లైన్లు

హెచ్‌పీసీఎల్‌కు చెందిన విశాఖ్‌ రిఫైనరీ విస్తరణ పనులకు అవసరమైన విద్యుత్తును భూగర్భ లైన్ల ద్వారా సరఫరా

చేయనున్నారు.

లైన్ల నిర్మాణ పనులకు గురువారం అధికారులు శ్రీకారం చుట్టారు.

రిఫైనరీ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్తును గంగవరం పోర్టు సమీపంలోని విద్యుత్తు కేంద్రం నుంచి పంపిణీ చేయడానికి

ప్రణాళికలు సిద్ధం చేశారు.

అక్కడ నుంచి రిఫైనరీకి భూగర్భం ద్వారా విద్యుత్తు లైన్లను వేయనున్నారు.

జీవీఎంసీ జోన్‌-4 పరిధిలో 2.5 కి.మీ, జోన్‌-5 పరిధిలో మరో 2.5కి.మీ పొడవున తవ్వకాలు చేపట్టనున్నారు.

ఈ పనుల కోసం హెచ్‌పీసీఎల్‌ రూ.10 కోట్ల మేర వ్యయాన్ని వెచ్చించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇందులో భాగంగానే పారిశామ్రిక ప్రాంతం కొత్తనక్కవానిపాలెంలో పనులను ప్రారంభించారు.