News

Realestate News

స్వచ్ఛత వైపు మరో అడుగు

vizag real estate news

స్వచ్ఛత వైపు మరో అడుగు
జిల్లాలో గత రెండేళ్లలో 60 పంచాయతీల్లో ఓడీఎఫ్‌
ప్రతికూల వాతావరణంతో లక్ష్యసాధనకు విఘాతం
విశాఖపట్నం, ఈనాడు:

* 2019 అక్టోబర్‌2 నాటికి బహిరంగ మల విసర్జనరహిత దేశం సాధించాలి – ప్రధాని మోదీ పిలుపు
* 2017 అక్టోబర్‌2 నాటికే విశాఖ జిల్లాను బహిరంగ మల విసర్జనరహితంగా మార్చాలి – జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ నిర్దేశించుకున్న లక్ష్యం..

ద్దేశం మంచిదే.. లక్ష్యం అమలుకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రజల్లో చైతన్యలోపం కొన్నిచోట్ల.. అధికారుల్లో ఉదాసీనత మరికొన్నిచోట్ల.. ఉత్సాహం ఉన్నా ప్రతికూల వాతావరణం మరికొన్నిచోట్ల కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో లక్ష్యం మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది.. అక్టోబర్‌ 2 నాటికి జిల్లాలో 70 పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహితం (ఓడీఎఫ్‌)గా మార్చాలని గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం లక్ష్యం నిర్దేశించుకుంటే.. కేవలం 15 పంచాయతీలను మాత్రమే ఓడీఎఫ్‌గా మార్చగలిగారు. గత 15 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పనులు ముందుకు సాగలేదన్నది అధికారుల వాదన.

జిల్లాలో 925 పంచాయతీలుంటే గతేడాది 28 పంచాయతీలను ఓడీఎఫ్‌గా మార్చి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది 225 పంచాయతీలను ఓడీఎఫ్‌గా మార్చాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా.. లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆపసోపాలు పడాల్సివస్తోంది.

కేవలం పదిహేనే..
జిల్లాలో గాంధీ జయంతి నాటికి 70 పంచాయతీలను ఓడీఎఫ్‌గా ప్రకటిస్తామని జిల్లా అధికారులు ప్రకటించారు. శనివారం నాటికి చోడవరం మండలంలోని జీజే పురం, గజపతినగరం, అనకాపల్లి పరిధిలోని సీతానగరం, దేవరాపల్లి పరిధిలోని ఎన్‌.గజపతినగరం, కోటవురట్ల పరిధిలోని చౌడవాడ, మాడుగుల పరిధిలోని వంతరాలపాలెం, మాకవరపాలెంలోని బీబీపాలెం, నాతవరం మండల పరిధిలోని వై.భూపతిపాలెం, పాడేరు మండలంలోని మినుములూరు తదితర 15 పంచాయతీల్లో మాత్రమే ఓడీఎఫ్‌ సాధించగలిగారు. మిగిలిన పంచాయతీల్లో మరుగుదొడ్ల నిర్మాణం కొలిక్కిరాలేదు. ఈ నెలాఖరు నాటికైనా పూర్తికావడం అనుమానంగానే ఉంది. ఇప్పటికే తవ్విన గోతుల్లో వరద నీరు చేరడంతో పనులు ముందుకు కదలడం లేదని చెబుతున్నారు.

* ఎలమంచిలి మున్సిపాలిటీని ఓడీఎఫ్‌గా అక్టోబర్‌ 2 నాటికి ప్రకటిస్తామని చెప్పినా ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మొత్తం 1790 మరుగుదొడ్లకుగాను 24 మరుగుదొడ్ల నిర్మాణం, బిల్లుల చెల్లింపుల్లో అడ్డంకులు ఉన్నాయి. ఈ ప్రక్రియ ఆదివారం నాటికి పూర్తిచేసి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని స్థానిక అధికారులు చెబుతున్నారు.

* నర్సీపట్నం మున్సిపాలిటీనీ గాంధీజయంతి నాటికి ఓడీఎఫ్‌గా ప్రకటించాలని నిర్ణయించినా.. ఇక్కడా పరిస్థితి అనుకూలంగా లేదు. ఇక్కడ 1,102 మరుగుదొడ్లకు 959 మాత్రమే పూర్తి చెయ్యగలిగారు.

జిల్లాలో ప్రగతి ఇలా..
జిల్లాలోని 225 పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో శతశాతం మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యంలో భాగంగా 86,895 మరుగుదొడ్లు కట్టాలి. వీటిలో ఇప్పటివరకు 16,604 మరుగుదొడ్లు పూర్తి చేయగలిగారు. 8,720 నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక ఓడీఎఫ్‌ పంచాయతీలకొస్తే.. ఈ ఏడాది 36 పంచాయతీల్లో శతశాతం మరుగుదొడ్లు నిర్మించారు. ఆరు పంచాయతీల్లో 75 శాతం వరకు మరుగుదొడ్లు కట్టారు. మరో ఏడు పంచాయతీల్లో 50 శాతం వరకు నిర్మించారు. మిగిలిన చోట్ల 50 శాతంలోపే నిర్మాణాలు జరిగాయి. వీటిని వేగవంతం చేసి అనుకున్న లక్ష్యాలు సాధించే చర్యల్లో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు.

వినియోగంలోనూ వెనుకబాటే..
అధికారులు, సిబ్బంది ప్రజల్లో చైతన్యం రగిలించి మరుగుదొడ్లు కట్టేలా చేస్తున్నా కొన్నిచోట్ల వీటిని వినియోగించడంలో వెనకబాటు కనిపిస్తోంది. నిర్మించిన వాటిలో 10 శాతం వరకు వినియోగించడం లేదన్నది సాక్షాత్తు అధికారులు గుర్తించిన లోపం. క్షేత్రస్థాయిలో కట్టినా వృథాగా వదిలేస్తున్న మరుగుదొడ్లు చాలానే ఉన్నాయి. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం జిల్లాలో ఓడీఎఫ్‌ పంచాయతీల తనికీకి రానుంది. ఈలోగా లక్ష్య సాధన వేగవంతం చెయ్యడంతోపాటు వీటి వినియోగంలోనూ చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

చలో తిరుపతి..
అక్టోబర్‌2న తిరుపతిలోని మహంతి ఆడిటోరియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఓడీఎఫ్‌ పంచాయతీల సర్పంచులు ప్రత్యేక బస్సులో తీసుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం జిల్లాపరిషత్తు కార్యాలయం నుంచి ఈ బస్సు బయలుదేరింది. అక్కడ సర్పంచులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రసంశా పత్రాలు అందించనున్నారు.

ప్రతికూల వాతావరణంతోనే ఆటంకం
– తోట ప్రభాకరరావు, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌
భారీ వర్షాల కారణంగా అక్టోబర్‌ 2 నాటికి ఓడీఎఫ్‌ లక్ష్యాలను అనుకున్నరీతిలో చేరలేకపోయాం. 15 రోజులపాటు పనులు ముందుకు సాగలేదు. 70 పంచాయతీలను ఓడీఎఫ్‌గా మార్చాలనుకుంటే 15 మాత్రమే మార్చగలిగాం. వచ్చే జనవరి 26 నాటికి గ్రామీణంలోని 39 మండలాల్లో మండలానికి 10 పంచాయతీల చొప్పున ఓడీఎఫ్‌గా మార్చాలని నిర్ణయించాం. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటాం.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo