స్మార్ట్ సిటీ పోస్టర్ ఆవిష్కరణ
స్మార్ట్ సిటీ పోస్టర్ ఆవిష్కరణ
బీచ్‌రోడ్, న్యూస్‌టుడే : పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా స్మార్ట్ సిటీ ఉద్యమంలో పాలు పంచుకోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. విశాఖపట్నంలో నిర్వహించన్ను పిఆర్ఎస్ఐ సదస్సులో విశాఖ స్మార్ట్ సిటీ, స్మార్ట్ కమ్యూనికేషన్‌ను ముఖ్య అంశంగా నిర్ణయించడం పట్ల అభినందించారు.
ఈ కార్యక్రమ పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అగ్రిహ్యాక్థాన్లోని సీఎం ఛాంబర్లో బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, సమాచార శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్, అజిత్పాతక్, యుఎస్శర్మ తదితరులు పాల్గొన్నారు.