News

Realestate News

స్టాక్‌మార్కెట్‌: ఫ్లాట్‌గా సూచీలు


స్టాక్‌మార్కెట్‌: ఫ్లాట్‌గా సూచీలు

 

ముంబయి: స్టాక్‌మార్కెట్‌: ఫ్లాట్‌గా సూచీలు

దేశీయ మార్కెట్ల వరుస లాభాలకు అడ్డుకట్టపడింది.

నేడు సాయంత్రం వెలువడబోయే టీసీఎస్‌ త్రైమాసిక ఫలితాలపై మదుపర్లు దృష్టిపెట్టారు.
 దీనికి తోడు అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి.
ఫలితంగా గురువారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభించాయి.
మదుపర్ల అప్రమత్తతతో ఆరంభం నుంచే ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
సెన్సెక్స్‌ 50 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించగా.. నిఫ్టీ 10,800 స్థాయిని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 31 పాయింట్ల నష్టంతో 36,182 వద్ద,
నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 10,840 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.39గా కొనసాగుతోంది. లోహ, వినియోగ రంగాల షేర్లు లాభాల్లో ఉండగా..
బ్యాంకింగ్‌, ఫార్మా రంగాల షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.

 

Tags :