సైన్స్ ఉత్సవ్-2016 ప్రారంభం
సైన్స్ ఉత్సవ్-2016 ప్రారంభం
సాగర్‌నగర్, న్యూస్‌టుడే(Science Utsav-2016 start) : గీతం వర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో నాలుగురోజుల పాటు జరగనున్న సైన్స్ ఉత్సవ్-2016 కార్యక్రమాన్ని బుధవారం సంబంధిత ప్రిన్సిపల్ ఆచార్య ఎస్.అరుణలక్ష్మి ప్రారంభించారు. పర్యావరణ శాస్త్రం నుంచి బయోటెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు వరకు ఫుడ్ సైన్స్ టెక్నాలజీలో చోటుచేసుకుంటున్న నూతన మార్పులు, అంశాలు తదితర వాటిపై అవగాహన కల్పించే దిశగా దీనిని నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు మరింత విజ్ఞానాన్ని పెంపొందించేందుకు సమాజానికి దోహదపడే విధంగా గీతంలో సైన్స్ రంగానికి సంబంధించి వివిధ విభాగాల్లో జరుగుతున్న పరిశోధన అంశాలపై అవగాహన కల్పిస్తామని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.