సెప్టెంబరు 22న వైశాఖీ నృత్యోత్సవం

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే:
నటరాజ్ మ్యూజిక్ అకాడమీ ఏటా నిర్వహించే వైశాఖీ నృత్యోత్సవ్ 9వ అఖిల భారత శాస్త్రీయ నృత్యోత్సవం-2016 గోడపత్రిక, ప్రచార సామగ్రిని తమిళనాడు గవర్నర్ డాక్టర్ కె.రోశయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. శుక్రవారం సాయంత్రం సర్యూ్కట్ హౌస్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. సంగీత నాటక అకాడమీ సహకారంతో సెప్టెంబరు 22 నుంచి 25వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ప్రతీరోజూ సాయంత్రం 6 నుంచి కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఎన్.ఎం.డి.ఎ. వ్యవస్థాపక అధ్యక్షుడు బి.విక్రమ్‌గౌడ్ తెలిపారు. న్యూఢిల్లీకి చెందిన పద్మవిభూషణ్ సోనాలీ మాన్షింగ్(ఒడిస్సీ), పద్మశ్రీ గోపాల్‌ప్రసాద్ దుబే బృందం, థానేకు చెందిన కష్మీరా త్రిదేవి(భరతనాట్యం), మణిపూర్‌కు చెందిన టి.నానోతుంబా సింగ్ బృందం(పూంగ్ చోలోమ్నృత్యం), ఆర్కే సానతోయ్ఛాను బృందం(మణిపురి) ప్రదర్శిస్తారని తెలిపారు. మూడోరోజు హైదరాబాద్‌కు చెందిన రమాదేవి, సేతూరామ్(కూచిపూడి), బత్తిన సోదరీమణులు(కూచిపూడి), నాలుగో రోజు హైదరాబాద్‌కు చెందిన అనుపమా కైలాష్(విలాసిని నృత్యం), అస్సామ్కు చెందిన నరేస్ చంద్రబారువా బృందం(సత్రియా) ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వపు వీసీ ఆచార్య బాలమోహన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.