News

Realestate News

సెజ్‌కు సౌర కళ

31-05-2016 vizagrealestate news

సెజ్‌కు సౌర కళ
రూ.4200 కోట్ల పెట్టుబడులు
4000మందికి పైగా ఉపాధి
ప్రభుత్వంతో ఒప్పందం ఖరారు
అచ్యుతాపురం, న్యూస్‌టుడే: స్థానిక ప్రత్యేక ఆర్థికమండలికి పరిశ్రమల రాక వేగం పుంజుకుంది. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో 9270 ఎకరాల పరిధిలో విస్తరించిన సెజ్‌లో ఖాళీ భూములకు ఎట్టకేలకు మోక్షం కలుగుతోంది. 12 ఏళ్లగా ఖాళీగా దర్శనమిచ్చిన భూముల్లో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు వరస కడుతున్నారు. రూ.24000 కోట్లతో 1200 ఎకరాల పరిధిలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో ఇప్పటికే ఎన్టీపీసీని ఇక్కడ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు అంతర్జాతీయ సౌర విద్యుత్తు పలకల తయారీ పరిశ్రమలు కూడా ఇక్కడ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. విశాఖ వేదికగా ఏర్పాటుచేసిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుల్లో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆయా సంస్థలు ముందడుగేస్తున్నాయి. అచ్యుతాపురం మండలంలో రూ. 3000 కోట్లతో ట్రినాసోలార్‌ కంపెనీని ఏర్పాటు చేయడానికి కంపెనీ పెద్దలు భూమిపూజ కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ పరిశ్రమలో 3వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన హరియోన్‌ సోలార్‌ కంపెనీ కూడా ఇక్కడ పలకల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, రాయితీలు, భూమి కేటాయింపులు కూడా ప్రభుత్వస్థాయిలో నిర్ణయం జరిగింది. రాంబిల్లి మండలం లాలంకోడూరు పరిధిలో 33 ఎకరాల భూమి కూడా కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.1188 కోట్ల పెట్టుబడులతో రాంబిల్లి మండలం లాలంకోడూరు పరిధిలో ఏర్పాటుచేసే ఈ హరియోన్‌ సోలార్‌ పరిశ్రమ ప్రత్యక్షంగా 1162 మందికి, పరోక్షంగా మరో 1500మందికి ఉపాధి కల్పించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రభుత్వంతో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ పరిశ్రమకు ప్రభుత్వం పలు రాయితీలు కూడా కల్పిస్తూ ఈ నెల 23న జీవో కూడా జారీచేసింది.

పరిశ్రమల రాకను స్వాగతిస్తున్నాం
పరిశ్రమలను ఏర్పాటుచేయడం వల్ల నిర్వాసితులకు ఉపాధి లభిస్తుంది. పదేళ్లగా అనుకున్న పరిశ్రమలు రాక, భూములేక ప్రత్యక్ష నరకం అనుభవించాం. తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమల రాక వేగం పుంజుకుంది. పూర్తిస్థాయిలో పరిశ్రమలు రావడం ఆనందంగా ఉంది. పరిశ్రమలకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తాం.

-బైలపూడి రాందాసు, నిర్వాసితుల ప్రతినిధి

మూసివేస్తున్న పరిశ్రమలను తెరిపించాలి
నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమే. దీంతోపాటు సెజ్‌లో మూసివేస్తున్న పరిశ్రమలపై కూడా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పటికే డబ్ల్యూఎస్‌, కాన్ఫెడెన్షియల్‌, అభిజీత్‌, సుందరం, నెట్‌మ్యాట్రిక్స్‌ వంటి పరిశ్రమలు మూసివేశారు. దీనివల్ల వేలాదిమంది కార్మికులు రోడ్డునపడ్డారు. ఈ పరిశ్రమలను తెరిపించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– కర్రి అప్పారావు, ప్రజాసంఘాల ప్రతినిధి

స్థానికులకు ఉపాధి లభిస్తుంది
సెజ్‌లో పరిశ్రమలు రావడం వల్ల స్థానికులు ఉపాధి లభించే అవకాశం ఉంది. సెజ్‌ ఏర్పాటుచేసి 12ఏళ్లు అయినా నేటికి పూర్తిస్థాయిలో పరిశ్రమలు రాక స్థానికులు ఉపాధి లభించలేదు. ఇప్పుడు పరిశ్రమలు రావడం వల్ల స్థానికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఏర్పాటుచేస్తున్న పరిశ్రమల్లో స్థానికులకు 90శాతం ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

-ద్వారపురెడ్డి బాబ్జీ, అచ్యుతాపురం

సెజ్‌లో పూర్తిస్థాయి పరిశ్రమలు
సెజ్‌ కోసం కేటాయించిన భూములు దాదాపు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చిన పరిశ్రమలకు వీటిని కేటాయించాం. ఎకరా భూమి కూడా సెజ్‌లో ఖాళీలేదు. భూములు పొందిన పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభిస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పరిశ్రమల ఏర్పాటుకు స్థానిక మద్దతు కూడా అవసరం. ట్రినాసోలార్‌, హరియోన్‌ సోలార్‌ పరిశ్రమలు వల్ల 5000 మందికి వరకు ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వంతో ఈ కంపెనీలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

-యతిరాజ్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌

 


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo