News

Realestate News

సెంట్రల్‌ పార్కును పోటెత్తిన సందర్శకులు

vizag real estate news

సెంట్రల్‌ పార్కును పోటెత్తిన సందర్శకులు
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: నగరంలోని వుడా సెంట్రల్‌ పార్కుకు సందర్శకులు పోటెత్తారు. ఆదివారం కావడంతో నగర ప్రజలు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఒక్కరోజులోనే వుడాకు రూ.3,29,320 ఆదాయం లభించింది. రాత్రి 8.30 గంటలకు చివరి ఫౌంటెయిన్‌ షోగా నిర్వాహకులు ప్రకటించి, పార్కులోకి అనుమతించకపోవడంతో కొందరు అక్కడున్న సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. తమను పార్కులోకి పంపాలని కోరారు. సందర్శకుల కోసం వసతులు కల్పించడంలో వుడా విఫలమైంది. పార్కింగ్‌ కోసం 222, 999 ఆర్టీసీ సర్వీసులు వెళ్లే రహదారిలోనూ, పార్కుకు ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డులో ద్విచక్రవాహనాలు, కార్లు నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్‌కు కాస్త ఇబ్బంది తలెత్తింది. అలాగే బయట విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోసం మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. పార్కు నిర్వహణ మొత్తానికి 25 మందిని మాత్రమే నియమించడంతో కష్టంగా ఉందని, మరికొంత మంది సిబ్బందిని కేటాయించాలని పార్కు వద్ద విధులు నిర్వహిస్తున్నవారు పేర్కొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo