సువ్వపాడులో సుందర జలపాతం

పర్యటకంగా అభివృద్ధి చేయాలంటున్న గిరిజనులు
హుకుంపేట, న్యూస్టుడే
ళీజూళి
* జలపాతాన్ని అభివృద్ధి చేయాలి
సువ్వపాడు గ్రామంలో ఉన్న సుందర జలపాతాన్ని అభివృద్ధి చేస్తే గ్రామస్థులతో పాటు పర్యటకులకు మంచి అనుభూతిని అందించవచ్చు. కొట్నాపల్లి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతానికి సరైన రహదారి సౌకర్యం లేదు. రహదారి ఏర్పాటు చేస్తే చాపరాయి కంటే అధికంగా పర్యటకుల్ని ఆకర్షిస్తుంది.
– సీదరి విష్ణు, సువ్వపాడు
గిరిజనులకు మార్గం చూపాలి
జలపాతం సమీపంలోని సువ్వపాడు గ్రామ ఆదివాసీ గిరిజనులకు జీవనోపాధి పొందేలా మార్గం చూపాలి. ఎంతో సుందరమైన జలపాతం చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తే గ్రామంతో పాటు గిరిజనులకు కూడా ఉపాధి కలుగుతుంది. ప్రభుత్వం, అధికారులు ఆ దిశగా ఆలోచన చేసి అన్నివిధాలా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.
– కొండమ్మ, సువ్వపాడు