News

Realestate News

సుందర మనోహరంగా అప్పన్న పూలతోట

vizag realestate news

సుందర మనోహరంగా అప్పన్న పూలతోట
రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు
సింహాచలం, న్యూస్‌టుడే: అప్పన్న స్వామి పూలతోటను భక్తులకు, యాత్రికులకు ఎంతో ఆహ్లాదం కల్గించేటట్టు నగరంలోని సెంట్రల్‌ పార్కు తరహాలో సుందర మనోహర ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం అప్పన్న స్వామి జమ్మివేట ఉత్సవంలో పాల్గొన్న అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఒకప్పటి మైసూర్‌ బృందావనంగా పేరొందిన ఉద్యానవనంలో అందమైన పూల మొక్కలు, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పేందుకు దేవస్థానంతో పాటు జీవీఎంసీ, వుడా భాగస్వామ్యం చేయాలని యోచిస్తున్నామన్నారు. అప్పన్న భక్తులు సింహాచలం దేవస్థానం అనుబంధ దేవాలయాలనూ తిలకించే విధంగా వాటి అభివృద్ధికి కూడా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించామన్నారు. ఈవో రామచంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.