సీలేరు-సబ్బవరం రహదారి పనులపై మంత్రి అయ్యన్న సమీక్ష
సీలేరు-సబ్బవరం రహదారి పనులపై మంత్రి అయ్యన్న సమీక్ష
వన్‌టౌన్, న్యూస్‌టుడే: సీలేరు-సబ్బవరం జాతీయ రహదారి పనుల ప్రగతిపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం గవర్నర్ బంగ్లాలో సమీక్షించారు. జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు, ఇతర అధికారులు హాజరయ్యారు. సీలేరు నుంచి చింతపల్లి, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, వడ్డాది, చోడవరం మీదుగా సబ్బవరం వద్ద ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారికి మార్గం కలుస్తుందని మంత్రి తెలిపారు. 240 కిలోమీటర్ల పొడవునా 200 అడుగుల విస్తీర్ణంలో రహదారి రానున్నదని తెలిపారు. సత్వరమే కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు. తుని-నర్సీపట్నం జాతీయ రహదారి పనులకు కేంద్రం ఆమోదం తెలిపిందని, దీనికి డీపీఆర్ తయారవుతోందని చెప్పారు. ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారి విస్తరణ విషయంలో కొన్ని చోట్ల మలుపులు తిరిగినట్లు తనకు సమాచారం అందిందని, దీనిపై ఆరా తీస్తానని మంత్రి వివరించారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399