News

Realestate News

‘సీమాంక్‌’ సేవలకు అంతా సిద్ధం

‘సీమాంక్‌’ సేవలకు అంతా సిద్ధం
ఘోసాసుపత్రిలో రూపుదిద్దుకున్న కొత్త బ్లాక్‌
నేటి నుంచి సేవలు ప్రారంభం
మహారాణిపేట, న్యూస్‌టుడే: ఘోషాసుపత్రిలో సీమాంక్‌ బ్లాక్‌ సేవలు అందించేందుకు సిద్ధమైంది. అగ్ని ప్రమాదం కారణంగా గత నెల 17 తేదీన సీమాంక్‌ బ్లాక్‌ పూర్తిగా కాలిపోయింది. దీంతో యూనిట్‌లో సేవలు నిలిపివేసిన సంగతి విదితమే. ఇన్నాళ్లూ అనారోగ్య శిశువులకు వేరేచోట సేవలు అందించారు. అయితే అక్కడ వసతులు సరిపోక ఆసుపత్రి సిబ్బంది, పిల్లల బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే కేజీహెచ్‌కు కూడా శిశువులు తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన సేవలు ప్రారంభించాలని సూచించడంతో బ్లాక్‌లోని సివిల్‌, ఎలక్ట్రికల్‌ పనులు పూర్తిచేశారు. అయితే కీలకమైన పరికరాలు రాకపోవడంతో ఇంతవరకూ సేవలు ప్రారంభించలేదు. అవి కూడా ప్రస్తుతం అందుబాటులోకి రావడంతో సీమాంక్‌ బ్లాక్‌ అన్నిరకాలుగా సిద్ధమైంది. ఈ బ్లాక్‌లో 13 బేబీ వార్మర్లు, ఎనిమిది ఫొటో థెరఫీ యూనిట్లు ఏర్పాటుచేశారు. ఆరు ఏసీలు, ఫ్యాన్లు, ఆక్సిజన్‌ అందించే యంత్రాలు కూడా ఏర్పాటు చేశారు. దీనిని గురువారం వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి పూనం మాలకొండయ్య ప్రారంభించే అవకాశం ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ హేమలతాదేవి తెలిపారు.