సీఎం కప్‌లో అదరగొట్టిన టి.అర్జాపురం
సీఎం కప్‌లో అదరగొట్టిన టి.అర్జాపురం
జిల్లాలోని రావికమతం మండలం టి.అర్జాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సి.ఎం కప్ ఆటల పోటీల్లో అదరగొట్టారు.
బాల్‌బ్యాడ్మింటన్ బాలుర అండర్-14, అండర్-17 విభాగాలు రెండింటిలోనూ జిల్లా విజేతలుగా నిలిచి మరోమారు సత్తాచాటారు.
అలాగే అండర్-14 నుంచి నలుగురు బాలురు, బాలిక సహా ఐదుగురు, అండర్-17 నుంచి బాలిక సహా ఐదుగురు చొప్పున రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీఎం బాల్‌బ్యాడ్మింటన్ డిస్ట్రిక్్్టమీట్, ఫైనల్ పోటీలు, విశాఖ జిల్లా తరఫున రాష్ట్రస్థాయి జట్టుకు ఆడే క్రీడాకారుల ఎంపిక పోటీలు అచ్యుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగాయి.
చోడవరం నియోజకవర్గం నుంచి ఈ పోటీల్లో అర్జాపురం జడ్పీ హైస్కూలుకు చెందిన అండర్-14, అండర్-17 బాలుర జట్లు పాల్గొన్నాయి.
అండర్-14 బాలుర విభాగంలో టి.అర్జాపురం జట్టు ఫైనల్ మ్యాచ్‌లో పెందుర్తి జట్టుపై గెలుపొంది ఆ విభాగంలో జిల్లా విజేతగా నిలిచింది.
అలాగే బాలుర అండర్-17 విభాగంలో అర్జాపురం జట్టు పాయకరావుపేటపై విజయం సాధించి జిల్లా విజేతగా నిలిచింది.
ప్రతిభ ఆధారంగా సెలక్షన్ కమిటీ రాష్ట్రస్థాయి జట్టుకు పది మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేసింది.
అండర్-14 బాలుర విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపిక చేసిన పది మంది సభ్యుల్లో అర్జాపురానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న రాజాన సాయి కృష్ణ, అడ్డూరి యేసు, ఇల్లపు మహేష్, మత్సా ఉదయ శంకర్ ఉన్నారు.
అలాగే బాలికల విభాగంలో రాజాన నూకరత్నం రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైంది. అండర్-17 విభాగంలో రాష్ట్రస్థాయి జట్టుకు బూసాల సతీష్,
పడాల సాంభశివ, మరిశా కుమార్, ఆరి క్రాంతికుమార్‌లు, బాలికల విభాగంలో మలిచెట్ల కుసుమ ఎంపికయ్యారని టి.అర్జాపురం హైస్కూలు
వ్యాయామ ఉపాధ్యాయుడు రమేష్‌నాయుడు తెలిపారు.
బాల్‌బ్యాడ్మింటన్ అండర్-14, అండర్-17 విభాల్లో రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన విద్యార్థులంతా నెల్లూరు జిల్లా గూడూరులో ఈనెల 13, 14, 15న జరిగే స్టేట్‌మీట్ పోటీల్లో ఆడనున్నారు.
విద్యార్థులను హెచ్.ఎం.జగన్నాథేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందించారు.