News

Realestate News

సింహాచలంలో వైభవంగా అప్పన్న కళ్యాణ మహోత్సవం

VIzag Real Estate News

సింహాచలంలో వైభవంగా అప్పన్న కళ్యాణ మహోత్సవం

విశాఖ: చైత్ర శుద్ధ ఏకాదశి శుక్రవారం సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. దేవాలయంలో మధ్యాహ్నం 3:45 గంటలకు కొట్నాల ఉత్సవం సాంప్రదాయబద్దంగా జరిగింది. సాయంత్రం 5:45 గంటలకు ధ్వజరోహణం చేశారు. రాత్రి ఏడున్నర గంటలకు మాడ వీధుల్లో ఎదురు సన్నాహోత్సవం జనరంజకంగా జరిగింది. అనంతరం సర్వాభరణ భూషితుడైన స్వామి ఉభయ దేవేరులతో రథాన్ని అధిరోహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు దంపతులు రథంలో ఉన్న స్వామిని పూజించి, కొబ్బరి కాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. జాలారి పెద్ద కదిరి లక్ష్మణరావు రథోత్సవానికి సారథ్యం వహించారు. జానపద కళారూపాలు, కోలాట నృత్యాలతో స్వామిని రథంపై ­రేగించారు. అనంతరం నరసింహ మండపంలో కళ్యాణ వేదికపై స్వామిని అధిష్టింప జేసి పండితుడు వేదమంత్రాలతో వివాహ మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వెంకట జ్యోతిర్మయి, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, ఘనబాబు, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ వై.అనురాధ, దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌ దంపతులు, తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo