News

Realestate News

సింహగిరిపై వైకుంఠవాసుని విగ్రహ ప్రతిష్ఠాపన

సింహగిరిపై వైకుంఠవాసుని విగ్రహ ప్రతిష్ఠాపన
సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరిపై చారిత్రాత్మకమైన వైకుంఠ వాసుని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈనెల 11న నిర్వహించేందుకు ఆలయ వైధికులు ముహూర్తం నిర్ణయించారు. ప్రతిష్ఠాపనకు సంబంధించిన పనుల్ని ఆలయ ఏఈవో ఎం.కృష్ణమాచార్యులు, స్థానాచార్యులు టీపీ రాజగోపాలాచార్యులు, అర్చకులు పరిశీలించారు. జీర్ణోద్ధారణ ప్రతిష్ఠ కార్యక్రమం ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు జరుగుతుంది. 9వ తేది సాయంత్రం నుంచి 10వ తేదీ ఉదయం వరకు అంకురార్పణ, హోమాలు నిర్వహిస్తారు. 11న ఉదయం 8.31 గంటలకు స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తారు. శతాబ్దాలనాటి వైకుంఠ వాసుని మెట్ట వద్ద వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ, వరద పాయస ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం. అంతటి ప్రత్యేకత గల స్వామి విగ్రహం శిథిలమైన నేపథ్యంలో కొత్త విగ్రహాన్ని తిరుపతిలో లక్ష రూపాయలతో తయారు చేయించి తీసుకొచ్చారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంతో వైకుంఠ వాసుని మెట్ట పూర్వ వైభవం సంతరించుకుంటుందని అధికారులు తెలిపారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo