News

Realestate News

సింహగిరిపై రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు

సింహగిరిపై రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు
సింహాచలం, న్యూస్‌టుడే: దివ్య క్షేత్రం అభివృద్ధిలో భాగంగా సింహగిరిపై రూ.3కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టడానికి దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. బుధవారం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌, రాష్ట్ర దేవాదాయశాఖ శిల్ప సలహాదారులు పెరుమళాచార్యులు, డీఈ మల్లీశ్వరరావులు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికల్ని పరిశీలించారు. సింహగిరిపై శిథిలావస్థలో ఉన్న కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయాన్ని తొలగించి తిరిగి రాతితో అత్యాధునికంగా నిర్మించడానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం దేవాలయంలో స్వామి దర్శనం అనంతరం భక్తులు కొబ్బరి కాయలు కొట్టే అమ్మవారి విగ్రహాన్ని దక్షిణ గోపురం వైపు మార్చాలని నిర్ణయించారు. అప్పన్న స్వామి ఆలయంలో ఉత్తర రాజగోపురం వద్ద నుంచి ఉత్తర ద్వారం వరకు గల క్యూకాంప్లెక్సును తొలగించి రాతితో నిర్మించి చందనయాత్ర నాటికి సిద్ధం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రధాన దేవాలయం వెనుక భాగంలో గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. రెండో వంటశాల పనులు చందన యాత్ర నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.