News

Realestate News

సింహగిరిపై భజన బృందాలకు శిక్షణ

సింహగిరిపై భజన బృందాలకు శిక్షణ

నేటి నుంచి ప్రారంభం

రెండేళ్లపాటు ప్రక్రియ కొనసాగింపు

సింహాచలం, న్యూస్‌టుడే, రాష్ట్ర దేవాదాయశాఖ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి భజన మండళ్లకు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖకు చెందిన రాష్ట్ర ఆలయాల పరిపాలన సంస్థ ఆధ్వర్యంలో ఈ తరగతులు నిర్వహిస్తామన్నారు. 40 మందితో కూడిన భజన బృందానికి సింహగిరిపై వసతి సదుపాయం, అన్నప్రసాద భవనంలో అల్పాహారం, కాఫీ, టీలు, వంటి సదుపాయాలు కల్పిస్తారు. ఈ తరగతులు 15 రోజులపాటు జరుగుతాయి. తర్వాత మరో బృందం తరగతుల్లో పాల్గొంటుంది. ఈ విధంగా భజన బృందాలకు రెండేళ్ల పాటు ఇక్కడ శిక్షణ ఇస్తారు. తర్వాత వీరంతా హిందూ ధర్మ ప్రచారం చేస్తారని తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు, భక్తులు రద్దీగా ఉన్న సమయాల్లో సింహగిరిపై భక్తులకే వసతి దొరకడం కష్టమై పోతోంది. ఈ పరిస్థితిలో 40 గదుల సత్రంలో భజన బృందాలకే 10 గదులు కేటాయిస్తే ఇక దూరప్రాంతాలకు చెందిన భక్తులు, పెళ్లి బృందాల పరిస్థితి ఏమిటని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో వసతులు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.