News

Realestate News

సింహగిరిపై ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం

సింహగిరిపై ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం
నెలగంటానాథంతో ఉత్సవాలకు శ్రీకారం

అడివివరం, న్యూస్‌టుడే: సింహగిరిపై అప్పన్న స్వామి ఆలయంలో శుక్రవారం నెల గంట మోగించి ధనుర్మాస ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వేకువజామున సుప్రభాతసేవ, ఆరాధన, అభిషేకం వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున నాదస్వర మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ అర్చకులు, సిబ్బంది ఆలయ రాజగోపురంలోని గంటను మోగించారు. అర్చకులు గోదాదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. స్వామికి తొలి పాశురాన్ని విన్నపం చేశారు. ఆళ్వారుల సన్నిధిలో ప్రత్యేక పూజలు, పారాయణలు నిర్వహించారు. బాలభోగం, రాజభోగం నివేదనలు చేసి భక్తులకు స్వామి దర్శనం కల్పించారు.

అనుబంధ దేవాలయంలో..
సింహాచలం దేవస్థానం అనుబంధ దేవాలయం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ ఈ ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు స్వామి మూలవిరాట్‌ను ఆభరణాలు, పీతాంబరాలతో అలంకరించారు. అమ్మవారిని పట్టువస్త్రాలు, పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించి గోదాదేవి అలంకరణలో అధిష్ఠింపజేశారు. తిరుప్పావై పాశురాల్లోని తొలిపాశురాన్ని స్వామిని నివేదించారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo