News

Realestate News

సింహగిరిపై ఆధ్యాత్మిక కార్యక్రమాలు

సింహగిరిపై ఆధ్యాత్మిక కార్యక్రమాలు
సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరిపై గజపతి సత్రంలో మూడు రోజుల పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆధ్యాత్మిక పీఠం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమాలు ఆదివారం నుంచి ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో శ్రీ సచ్చిదానంద తీర్థ స్వామిజీ, శంకరానంద స్వామిజీ ధార్మికోపన్యాసం చేస్తారని తెలిపారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామార్చన, రుద్రాభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయన్నారు.

*అప్పన్న సేవలో స్వామీజీలు: ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన శ్రీసచ్చిదానంద తీర్థ, శంకరానంద స్వామిజీ ఆదివారం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ఆధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని బేడా మండపం ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo