News

Realestate News

సింహగిరికి మణిహారం

సింహగిరికి మణిహారం
రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణం
త్వరలో ప్రారంభానికి సిద్ధం
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల రద్దీ అధికమైంది. దీంతో ప్రస్తుతం ఉన్న కొండదారిలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఉత్సవాల సమయంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటోంది. ఈ సమస్య పరిష్కారానికి దేవస్థానం రూ.3.10 కోట్ల వ్యయంతో రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి పూనుకుంది. కొన్నాళ్లు పనులు నత్తనడకన సాగినా ఇటీవల ఒక్కసారిగా వూపందుకోవడంతో పనులు వేగంగా పూర్తయ్యాయి. అడివివరంలోని గురుకుల పాఠశాల సమీపం నుంచి ప్రారంభమయ్యే ఈ కొండదారిని 1.3 కిలోమీటర్లు బీటీ రోడ్డుగా నిర్మించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో కోడ్‌ ముగిశాక ఈ రహదారిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo