News

Realestate News

సింపోజియంలో రక్షణ పరికరాల ప్రదర్శన


సింపోజియంలో రక్షణ పరికరాల ప్రదర్శన

సింధియా, న్యూస్‌టుడే:సింపోజియంలో రక్షణ పరికరాల ప్రదర్శన……….

ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండు పరిధిలోని ఐఎన్‌ఎస్‌ విశ్వకర్మలో నిర్వహిస్తున్న ‘కోరోజిన్‌ మేనేజ్‌మెంట్‌’ 

సింపోజియంలో శుక్రవారం రక్షణ పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేశారు.

 

కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ, పరిశోధన, అకాడమిక్‌ తదితర రంగాలకు చెందిన నిపుణులు పలు సూచనలు,

సలహాలు ఇచ్చారని నేవీ వర్గాలు తెలిపాయి.

ప్రధానంగా నౌకల నిర్మాణం, హల్‌, మౌలిక సదుపాయాల కల్పన, తదితర అంశాలను ప్రస్తావించారు.

ప్రదర్శనలో ఉంచిన వివిధ రకాల పరికరాలను సీఐఐ, డీఆర్డీవో, ఏయూ, నౌకాదళాలకు చెందిన ప్రతినిధులు పరిశీలించారు.

నేవీ నుంచి ఈఎన్‌సీ చీఫ్‌ కరంబీర్‌సింగ్‌, ఏయూ ఉపకులపతి నాగేశ్వరరావు, సీఐఐ ఛైర్మన్‌ రుద్రరాజు, శాస్త్రవేత్త కామత్‌ తదితరులు పాల్గొన్నారు.