సాహోరే.. ఆర్చరీ

సాహోరే.. ఆర్చరీ
ఉత్సాహంగా రెండో రోజు విలువిద్య పోటీలు
చిన్నారులు సహా యువకుల ధనుర్భాణాస్త్రం
కోలాహలంగా క్రీడా మైదానం

ప్రత్యేక ఆకర్షణగా శివాని ప్రదర్శన
ఈ పోటీల్లో చెరుకూరి డాలి శివాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎల్కేజీ చదువుతున్న శివాని 15 నిమిషాల్లో 100 విల్లంబులను ఏకధాటిగా సంధించి ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ బాలికతోపాటు మరో బుడతడు హర్ష సైతం పోటాపోటీగా బాణాలు వదిలాడు. శివాని అండంü-9 విభాగంలో జాతీయ స్థాయి ఛాంపియన్‌గా నిలిచినట్లు ఆమె తండ్రి చెరుకూరి సత్యనారాయణ తెలిపారు. ఇండియన్ గంü్ల టాలెంట్ ప్రోగ్రామ్‌లోనూ ఈ బాలిక ప్రదర్శన ఇచ్చి ప్రత్యేక గుర్తింపు సాధించారన్నారు. 35 నెలల్లో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుతోపాటు పలు జ్ఞాపికలు అందుకున్నట్లు ఆమె తండ్రి చెప్పారు. శివాని మాట్లాడుతూ 2024లో ఒలింపిక్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమన్నారు.
ఆర్చరీ క్రీడకు ఏకాగ్రత, యుక్తి, టెక్నిక్ ముఖ్యమని నిపుణులు తెలిపారు. సాధనతో ఈ లక్ష్యాన్ని ఛేదించవచ్చన్నారు. ఈ ఆర్చరీ క్రీడల్లో గుర్తింపు లభించి అవార్డులు సాధిస్తే ఎంసెట్ వంటి పరీక్షల్లో రిజర్వేషన్ కోటా కింద సునాయసంగా సీట్లు పొందవచ్చునని చెప్పారు. క్రీడల్లో ఆర్చరీకి ఏ గ్రేœü స్ధానం ఉందన్నారు.
మొదటిసారిగా పాల్గొన్నా..: రాష్ట్రస్థాయి క్రీడల్లో మొదటిసారిగా పాల్గొంటున్నా. జిల్లాస్థాయికి ఎంపికయ్యా. మున్ముందు ఆర్చరీలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే నా లక్ష్యం. -హుస్సేన్‌బీ, శిరువెళ్ల
గెలుపే లక్ష్యం: రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇక్కడ క్రీడాకారులను చూస్తుంటే ఈ క్రీడపై మరింత ఆసక్తి పెరిగింది. ఆర్చరీలో లక్ష్యం సాధించినప్పుడు ఆనందం మాటల్లో చెప్పలేనిది. గెలుపే లక్ష్యంగా పాల్గొంటున్నా. – నవిద, శిరువెళ్ల
సహకారం లభిస్తే శ్రీశైలంలో అకాడమీ ఏర్పాటు
నల్లమల అడవుల్లో జీవించే చెంచులు విలు విద్యకు మారుపేరైన విషయం మనందరికీ తెలిసిందే. నేడు చెంచు జాతి విలు విద్యను మరచిపోయే స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో ఆర్చరీ అకాడమి ఏర్పాటు చేస్తే 75 శాతం మంది చెంచులు, 25 శాతం మంది మిగతా సామాజిక వర్గాల వారికి స్థానం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అకాడమి ఏర్పాటుకు జిల్లా కలెక్టరు, దేవస్థానం ఈవో, ఐటీడీఏ పీవో సహకారం అందించాలి. ప్రస్తుతం ఈ క్రీడా పోటీల నిర్వహణకు దేవస్థానం ఈవో భరÅüగుప్తా, సత్ర సంఘాల సమాఖ్య, డిగ్రీ కళాశాల వారు ఎంతో సహకారం అందించారు.