News

Realestate News

సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రపంచబ్యాంకు నిధులు


సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రపంచబ్యాంకు నిధులు

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే:  జిల్లాలోని సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రపంచబ్యాంకు కేటాయించిన నిధులను

జిల్లాలోని సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రపంచబ్యాంకు కేటాయించిన నిధులను

వచ్చే ఏడాది జనవరి నుంచి ఖర్చు చేస్తామని జలవనరులశాఖ పర్యవేక్షక ఇంజినీరు పి.శశిభూషణరావు తెలిపారు.

శుక్రవారం రావణాపల్లి జలాశయాన్ని ఆయన సందర్శించారు.

ఇటీవల ఈ జలాశయ ప్రధాన గేటు మరమ్మతుకు గురికావడంతో వరిపంటకు నీటి విడుదల తాత్కాలికంగా నిలిచిపోవడం తెలిసిందే.

గేటు పునరుద్ధరణకు రూ.10 లక్షలు మంజూరు కావడంతో అడ్డుకట్ట నిర్మించి గేటును తాత్కాలికంగా మరమ్మతు చేసి పంటలకు నీళ్లిచ్చారు.

ఈ పనులను  పరిశీలించేందుకు ఆయన విచ్చేశారు.

స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సకాలంలో మరమ్మతులు చేసి పంటలకు ఇబ్బంది లేకుండా నీళ్లివ్వగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు.

పంటకాలం పూర్తికాగానే కొత్తగేటు ఏర్పాటుచేస్తామన్నారు.

గేటు పరిసరాల్లో పూడికతీత పనులు చేపడతామని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ జలవనరులు, జీవనోపాధుల పెంపుదల ప్రాజెక్టు కింద ప్రపంచబ్యాంకు రైవాడ జలాశయ ఆధునికీకరణ పనులకు రూ.36 కోట్లు, జిల్లాలో 50 చెరువుల పొర్లుకట్లు, మదుంల పునరుద్ధరణ పనులకు రూ.18 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.

ఈ పనులకు ప్రభుత్వం నుంచి పరిపాలన ఆమోదం లభించిందని వెల్లడించారు.

నీరు-చెట్టు కార్యక్రమం కింద ఈ ఏడాది జిల్లాకు రూ.20 కోట్లు కేటాయించారన్నారు.

ఆయన వెంట కార్యనిర్వాహక ఇంజినీరు కె.మల్లికార్జునరావు, డీఈఈ చిన్నంనాయుడు ఉన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo