News

Realestate News

సమ సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం

structure of society

మంత్రి రావెల కిషోర్‌బాబు

దళిత, గిరిజన బాటలో రూ.205 కోట్లు విలువైన రుణాలు, ఉపకరణాల పంపిణీ

ఏయూ ప్రాంగణం :

సమసమాజ నిర్మాణమే తెలుగుదేశం ప్రభుత్వ ప్రధాన ఆశయమని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో బుధవారం ‘దళిత, గిరిజన బాట’ను నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ దళిత, గిరిజన బాటను కర్నూలులో ప్రారంభించామని.. విశాఖలో ముగిసిందన్నారు. మన ముఖ్యమంత్రి ఆధునిక అశోకచక్రవర్తి అని కొనియాడారు. విశాఖ జిల్లాలో రూ.205 కోట్లు విలువైన రుణాలు, వివిధ యూనిట్లను 1.93 లక్షల మందికి అందజేశామని చెప్పారు. రూ.12వేల కోట్లతో ఎస్‌సి ఉపప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని వసతి గృహాలను రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా మార్చి కార్పొరేటü కంటే మెరుగైన విద్యనందివ్వనున్నామని తెలిపారు. మానవ వనరులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఒక సంస్థ బీచ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామంది. వీరి విజ్ఞాపన మేరకు కలెక్టర్‌, ఉడా వీసీ, కమిషనర్‌ తదితరులు చర్చించి అనుమతుŒలు ఇవ్వాల్సి ఉంది. ఈ తరుణంలోనే విశాఖకు ఉన్న పేరు ప్రఖ్యాతులను దెబ్బతీయాలని జగన్‌ బృందం ప్రయత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీసే ఏ కార్యక్రమమూ నిర్వహించబోమని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన అనంతరం కూడా ఇష్టానుసారం ఆరోపణలు, ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మీరు ఉపాధి, పెట్టుబడులకు సంబంధించి చేసిన ఆరోపణలపై బహిరంగ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మంత్రి గంటా సవాల్‌ విసిరారు. యాదృచ్ఛికమో ఏమో కానీ ఈరోజు దళిత, గిరిజన బాట జరుగుతుంది. ఇంత వరకు విశాఖకు గిరిజనుడెవరూ కలెక్టర్‌గా చేయలేదు. గిరిజనుడనైన నేను ఇక్కడ కలెక్టర్‌గా ఉన్నాను. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గిరిజనులేనని దళిత, గిరిజన బాటలో జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ బాబూరావునాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌లో ఉన్నత చదువులు చదివేందుకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు పొందిన విజయనగరం జిల్లాకు చెందిన అభినయ అనే విద్యార్థినిని సభకు మంత్రి పరిచయం చేశారు. దళిత గిరిజన బాటలో ఎస్‌.సి, ఎస్‌.టి. లబ్ధిదారులకు పలు ఉపకరాలను పంపిణీ చేశారు. విద్యార్థులు, కళాకారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పలు శాఖలు స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo