సమాజ అభివృద్ధికి విద్య దోహదం
సమాజ అభివృద్ధికి విద్య దోహదం
విశాఖపట్నం, న్యూస్టుడే: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు అన్నారు. ఎన్ఏడీ కొత్తరోడ్డు రామకృష్ణ పాఠశాలలో ఏపీ అన్ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజాభివృద్ధికి విద్య దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అపుస్మా విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎంవీ.రావు, ప్రధాన కార్యదర్శి ఎస్.శ్రీనివాసరావు, కోశాధికారి ఎంవీవీ సత్యనారాయణను ఎమ్మెల్సీ గాదె అభినందించారు. అనంతరం నేటి విద్యావ్యవస్థ- తీరుతెన్నులు అనే అంశంపై సభ్యులతో చర్చించారు. కార్యక్రమంలో అపుస్మా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399