News

Realestate News

సమస్యలపై పోరాటాలతోనే ప్రజల అభిమానం


సమస్యలపై పోరాటాలతోనే ప్రజల అభిమానం

సమస్యలపై పోరాటాలతోనే ప్రజల అభిమానం

ప్రజాసమస్యల పోరాటంతోనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతామని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు.

ఏ పదవుల్లో లేకపోయినప్పటికీ పోరాటాలు చేయడం వలన ప్రజల అభిమానంతో పదవులు వాటంతట అవే వస్తాయన్నారు.

మండలంలోని ఉగ్గినపాలెంలో మంగళవారం నిర్వహించిన అనకాపల్లి మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ మలసాల కిశోర్‌ పుట్టిన రోజు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధనకు చేసిన పోరాటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి రూ.2800 కోట్ల నిధులు కేటాయించారని పేర్కొన్నారు.

పలు ఆసుపత్రుల్లో రోగులకు, బాలింతలకు కిశోర్‌ పాలు, రొట్టె పంపిణీ చేశారు. కార్యక్రమంలో అనకాపల్లి వర్తక సంఘం అధ్యక్షుడు కొణతాల లక్ష్మీనారాయణ, ఎస్‌ఎండీ గౌస్‌, తాళ్లపాలెం మాజీ సర్పంచి

చిన్నివల్లభ నారాయణరావు, నర్సింగబిల్లి పీఏసీఎస్‌ అధ్యక్షుడు సింహాద్రిరావు, చీడికాడ జడ్పీటీసీ సభ్యురాలు సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo