News

Realestate News

సమయం లేదు.. విద్యార్థీ!

సమయం లేదు.. విద్యార్థీ!
28తో ముగుస్తున్న చంద్రన్న ఉపకారవేతనాల దరఖాస్తు గడువు
50 శాతం మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు
అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా పథకం ఒక వరం. ఇందులో నమోదైన వారి పిల్లలకు ఏటా ప్రభుత్వం ఉపకారవేతనాలు అందజేస్తోంది. ఈ ఏడాది దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈనెల 28వరకు ఉంది. అయితే అర్హుల్లో సగం మంది కూడా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేదు. సరైన అవగాహన లేకపోవటంతో చాలా మంది విద్యార్థులు ముందుకు రావడంలేదని అధికారులు చెబుతున్నారు.

న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ
చంద్రన్న బీమా పథకంలో నమోదైన అసంఘటిత కార్మికుల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకారవేతనం ప్రభుత్వం ఇస్తోంది. 9, 10, ఇంటర్మీడియట్‌, ఐ.టి.ఐ. చదివిన వారు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రజాసాధికార సర్వే నిర్వహించిన సమయంలోనే సిబ్బంది ఇంటింటికి వెళ్లి అసంఘటిత కార్మికులను గుర్తించి, వారిని చంద్రన్న బీమా పథకంలో నమోదు చేశారు. జీవీఎంసీ పరిధిలో సుమారు 6లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కుటుంబాల్లో 9, 10, ఇంటర్మీడియట్‌, ఐ.టి.ఐ. చదువుతున్న విద్యార్థులు సుమారు 62 వేల మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. వీరిలో ఇప్పటి వరకు 32వేల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. సమయం లేకపోవటంతో ఆయా విద్యా సంస్థల సిబ్బందికే తర్ఫీదు ఇచ్చి, విద్యార్థుల ఆధార్‌ నెంబరు, బ్యాంకు ఖాతా నెంబరు తదితర వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

గత ఏడాది 58వేల మందికి ప్రయోజనం..
గత ఏడాది చంద్రన్న బీమా పథకంలో భాగంగా జీవీఎంసీ పరిధిలో 58వేల మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించి ఉపకారవేతనాలు అందించారు. ఆధార్‌ ఆధారంగా పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌ విద్య, సాంకేతిక విద్య తదితర విభాగాల నుంచి ఆయా విద్యార్థుల వివరాలను సేకరించి, 2016-17 సంవత్సరం ఉపకారవేతనాన్ని నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేశారు. 58వేల మంది విద్యార్థులకు జనవరిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఉపకారవేతనాల ధ్రువపత్రాలను సైతం అందజేశారు.
2017-18కి సంబంధించి ఉపకారవేతనాల జారీలో ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన(పి.ఎం.జె.జె.బి.వై.) జోక్యంతో కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారమే ఉపకారవేతనాలు జారీ చేయాలని ఉత్తర్వులు వచ్చాయి. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న బీమా కింద ప్రయోనం పొందే విద్యార్థుల వివరాలను పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌ విద్య, సాంకేతిక విద్య, ఐ.టి.ఐ.ల నుంచి సేకరించి జిల్లా కార్యాలయానికి పంపించారు. ప్రభుత్వం పంపించిన నివేదిక ప్రకారం జీవీఎంసీ పరిధిలో 62,321 మంది విద్యార్థులు అర్హులుగా గుర్తించారు. అయితే అందరి పేర్లను ఆన్‌లైన్‌ చేయడానికి సమయం లేకపోవడంతో ఆయా విద్యాసంస్థల యజమాన్యాలతో చర్చించి, అక్కడి సిబ్బందికి శిక్షణ ఇచ్చి, అర్హులైన విద్యార్థుల వివరాలను చంద్రన్న బీమా వెబ్సైట్‌లో నమోదు చేయిస్తున్నారు. జీవీఎంసీ యూసీడీ/మెప్మా కార్యాలయాల్లో కూడా అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసి విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు.

27 నాటికే అందించాలి..
జీవీఎంసీ పరిధిలో 9, 10, ఇంటర్మీడియట్‌, ఐ.టి.ఐ. చదువుతూ, తల్లిదండ్రులు చంద్రన్న బీమా పథకంలో నమోదై ఉంటే ఆయా విద్యార్థులకు రూ.1200 ఉపకారవేతనం ప్రభుత్వం అందిస్తోంది. అర్హత గల విద్యార్థులు ఆధార్‌, తల్లిదండ్రుల ఆధార్‌ నెంబర్లు, తల్లి/తండ్రి/విద్యార్థి బ్యాంకు ఖాతా జిరాక్సు కాపీ, ఫోన్‌నెంబరు వివరాలను ఆయా పాఠశాలల్లో, జోనల్‌ కార్యాలయాల్లో, యూసీడీ విభాగంలో, వార్డు కార్యాలయంలోని యూసీడీ సిబ్బందికి అందజేయాలి. ఈ నెల 28 వరకు గడువు ఉండటంతో 27 నాటికే పూర్తి వివరాలు అందించడం మంచిది.

– శ్రీనివాసన్‌, పథక సంచాలకులు, యూసీడీ, జీవీఎంసీ చంద్రన్న బీమా ఉపకా

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo