సప్తవర్ణ దుప్పట్లతో సమర్థ సేవలు
ప్రభుత్వాసుపత్రుల్లో వసతులను మరింత మెరుగుపరుస్తాం
సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆసుపత్రుల్లో కొత్తకొత్త కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, దీనిలో భాగంగా రోజుకో రంగు దుప్పట్లు పడకలపై మార్చుతామని చెప్పారు. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ వైద్యసేవ తదితర అనే కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రతీరోజూ దుప్పట్లు మార్చడం వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని, తద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. ఈ పథకం సమర్థంగా అమలయ్యేల3ఆ వైద్యాధికారులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఒక వేళ దుప్పటి మార్చకుంటే సర్వీసు ప్రొవైడర్‌ను రోగులే నిలదీయాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ విశాఖనగరంలో 8 ఆసుపత్రుల్లో 4 వేల పడకలకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సప్తవర్ణ దుప్పట్ల గోడపత్రికను విడుదల చేశారు. తొలుత ప్రసూతి విభాగంలోని పడకలపై కొత్త దుప్పట్లను వేశారు.
వెలగపూడి… మాట్లాడు…
వీడియోకాన్ఫరెన్స్లోకి వచ్చిన సీఎం చంద్రబాబు.. తూర్పు ఎమ్మెల్యేను వెలగపూడి రామకృష్ణబాబును పలుకరించారు. ‘‘వెలగపూడి.. మాట్లాడూ..’’ అని సంబోధించారు. దీంతో వెలగపూడి మాట్లాడుతూ ఇది మంచి కార్యక్రమమని, రోగులకు ఉపకరిస్తుందన్నారు.
* ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం 12 గంటల తర్వాత ప్రారంభమైంది. దీంతో చిన్న పిల్లలు, బాలింతలు ఉండే ప్రసూతి వార్డులో రోగులు కొంత ఇబ్బంది పడ్డారు. అతిథులు కూర్చోడానికి కూడా అవస్థలు పడాల్సి వచ్చింది. మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చినప్పటికీ కొద్దిసేపు మాత్రమే ఉండి వెనుదిరిగారు. మంత్రి అయ్యన్నపాత్రుడు చాలాసేపు ఉన్నారు.
బాలింతతో మాటామంతి…
వీడియో కాన్ఫరెన్సు ద్వారా దుప్పట్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు కేజీహెచ్ ప్రసూతి వార్డులో చికిత్స పొందుతున్న కంచరపాలెంకు చెందిన బాలింత కర్రి నూకరత్నంతో మాట్లాడారు.
సీఎం: ఏమ్మా ఎలా ఉన్నారు..?
నూకరత్నం: నమస్తే సార్.. నేను కంచరపాలెం ప్రాంతం నుంచి పురిటికోసం వచ్చానండీ. వారం రోజులుగా ఇక్కడే చికిత్స పొందుతున్నాను. సిజేరియన్ శస్త్రచికిత్స చేశారు.
సీఎం : సేవలు ఎలాగున్నాయమ్మా?
నూకరత్నం: కేజీహెచ్‌లో వైద్య సేవలు బాగున్నాయండి. కార్పొరేట్ ఆసుపత్రి కన్నా ఇక్కడే మంచి వైద్యం దొరుకుతోంది. వైద్యులు, సిబ్బంది బాగా సేవలందిస్తున్నారు.
సీఎం: కొత్త పథకాలు ఎలా అమలవుతున్నాయి?
నూకరత్నం: దుప్పట్ల పథకం చాలా బాగుంది సర్. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వంటివి బాగా అమలవుతున్నాయి.