News

Realestate News

సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ

Arms traditionally worship

సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ
సింహాచలం, న్యూస్‌టుడే: మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో శనివారం ఆయుధ పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. తొలుత అర్చకులు స్వామి వారి ఆయుధాలను అమ్మవారి సన్నిధిలో ఉంచి విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి మూలా నక్షత్ర పూజలు జరిపారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సాయంత్రం తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. దశమి వరకు ఆయుధ పూజలు నిర్వహిస్తామని ఆలయవర్గాలు తెలిపాయి.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo