News

Realestate News

సంద్రంలో గర్జన


సంద్రంలో గర్జన

అబ్బురపరిచిన నేవీ విన్యాసాలు

న్యూస్‌టుడే, ఎంవీపీ కాలనీ

 

సంద్రంలో గర్జన

ఆకాశం నుంచి ఒక్కసారిగా పదుల సంఖ్యలో పారా సెయిలర్స్‌ భూమిపైకి దూసుకు వస్తూంటే…

యుద్ద విమానాలు ఒక్కసారిగా ఆకాశంలో రయ్‌ అంటూ శబ్దం చేస్తూ దూసుకుపోతుంటే…

జెమినీ బోట్లతో నావికాదళ సైనికులు తీరానికి దూసుకువస్తుంటే…

చూస్తున్న వారంతా ఊపిరి బిగబట్టాల్సిందే.

ఇటు ఆకాశంలో, అటు సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొందా అన్నట్లుగా నమూనా విన్యాసాల ప్రదర్శన అబ్బుపరిచింది.

నేవీ డేను పురస్కరించుకుని తుది సన్నాహక సమర విన్యాసాలను సోమవారం సాయంత్రం ప్రదర్శించారు.

నావికాదళ ఉన్నతాధికారులతో పాటు నగరవాసులు పెద్ద సంఖ్యలో విశాఖ తీరానికి చేరుకున్నారు.

సుమారు రెండు గంటల పాటు నావికాదళ, ఆర్మీ సైనికులు చేపట్టిన నమూనా విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి.

నావికా బ్యాండ్‌ వీనుల విందుగా సాగింది.

సముద్రంలో యుద్ధమే జరుగుతుందా అన్న భావన కలిగేలా సైనికుల ప్రదర్శన అబ్బుపరిచింది.

తీరంలో శత్రువులను నియంత్రించేందుకు కమెండోల ఆపరేషన్‌,

మినీ బోట్లపై తీరానికి వచ్చిన సైనికులు కనపరిచిన యుద్ధ పోరాట పటిమ,

పారా సెయిలర్స్‌ ఆకాశంలో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దూరాన ఉన్న లక్ష్యాన్ని సైతం ఎదుర్కొనేలా మన సైనికులు సత్తాను విశాఖ సాగరతీరంలో ప్రదర్శించారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo