News

Realestate News

సందడిగా వైపీఎల్‌-5 ఫుట్‌బాల్‌ పోటీలు

సందడిగా వైపీఎల్‌-5 ఫుట్‌బాల్‌ పోటీలు
నరసన్నపేట, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో శుక్రవారం సాయంత్రం వైఎంసీఏ ఆధ్వర్యంలోవైపీఎల్‌-5 (ఎర్రన్నాయుడు ప్రీమియం లీగ్‌) అంతర్రాష్ట్ర ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఫ్లడ్‌లైట్ల నడుమ రాత్రంతా ఈ పోటీలు జరిగాయి. పోటీల్లోని జట్లను వైఎంసీఏ కార్యదర్శి గొద్దు చిట్టిబాబు పరిచయం చేసుకున్న అనంతరం పోటీలు ప్రారంభమయ్యాయి. తొలుత నరసన్నపేట వైఎంసీఏ జట్టు, టెక్కలి ఐతమ్‌ కళాశాల జట్ల నడుమ తొలి పోటీ ప్రారంభమైంది. ఈ పోటీలో 4-0 తేడాతో నరసన్నపేట వైఎంసీఏ జట్టు విజయం సాధించింది. అనంతరం శ్రీకాకుళం, ఇచ్ఛా పురం జట్లు పోటీ పడ్డాయి. జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి చౌదరి వెంకటరావు, జాతీయస్థాయి రిఫరీలు శ్రీనివాసరావు, అప్పన్న, టిక్కు, వైఎంసీఏ ప్రతినిధులు బంకుపల్లి రవికుమార్‌, ధర్మాన శేఖర్‌, పి.రాము తదితరుల పర్యవేక్షణలో పోటీలు నిర్వహించారు. పోటీలను ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, నరసన్నపేట ఏఎంసీ అధ్యక్షుడు భైరి భాస్కరరావు తిలకించారు. వీరి వెంట చైతన్యభారతి కన్వీనరు చింతు పాపారావు, ఎంపీటీసీసభ్యులు పీస కృష్ణ, జామి వెంకటరావు, తాళాభక్తుల గోవిందరావు, షేక్‌ మదీనా,నాయకులు శిమ్మ చంద్రశేఖర్‌, కింజరాపు రామారావు, బోయిన సతీష్‌, కింజరాపు మోహనరావునాయుడు, బెవర రాము తదితరులున్నారు.