News

Realestate News

శ్రీనివాసుడి కల్యాణానికి చురుగ్గా ఏర్పాట్లు

శ్రీనివాసుడి కల్యాణానికి చురుగ్గా ఏర్పాట్లు
కొత్తకోట (రావికమతం), న్యూస్‌టుడే: జిల్లాలోని కొత్తకోటలో ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న శ్రీనివాసుడి మహా కల్యాణ మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇక్కడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం వేదికగా ఆదివారం ఉదయం 5 గంటల నుంచి శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే గోడప్రతులను ముద్రించి వూరూరా ప్రచారం చేశారు. సోమవారం నుంచి కల్యాణం నిర్వహించే జిల్లా పరిషత్‌ క్రీడా మైదానాన్ని చదును చేస్తున్నారు. ఈ కల్యాణం కోసం సుమారు రూ. 20 లక్షలు వరకు ఖర్చుచేయన్నారు. అనకాపల్లికి చెందిన ఆదిదేవుడి మహా భక్తుడు తిమ్మాపాత్రుని చక్రవర్తి, కొత్తకోటకు చెందిన గ్రామ నవరత్న ఫ్రెండ్స్‌ సంయుక్త సహకారంతో శ్రీనివాసుడి మహా కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo