News

Realestate News

శ్రావణలక్ష్మి… సిరుల కల్పవల్లి…

శ్రావణలక్ష్మి… సిరుల కల్పవల్లి…

వన్‌టౌన్‌: శ్రావణ మాసం తొలి శుక్రవారం వేళ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలను దేవస్థానం మామిడి తోరణాలు, పూల జడలతో అందంగా అలంకరించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలకు తరలివచ్చారు. 11 గంటల సమయానికి భక్తుల వరుస మెయిన్‌ రోడ్డును తాకింది. ఆలయ ఆవరణలో దేవస్థానం నిర్వహించిన శ్రావణ శుక్రవారం పూజలకు 330 మంది ఉభయ దాతలు హాజరయ్యారు. ఎప్పటి మాదిరిగానే ఆలయ ఆవరణలో లక్ష్మీహోమం నిర్వహించారు. ఈవో ఎస్‌.జె.మాధవి, పాలక మండలి ఛైర్మన్‌ డబ్లు్య.భాస్కరరావు, ట్రస్టీ చంద్రరావు, ఆలయ అధికారులు వి.రాంబాబు, పి.రామారావు, సూర్యకుమారి, సిహెచ్‌.వి.రమణ, రాజు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యే సందర్శన: అమ్మవారిని అనకాపల్లి ఎంపీ ఎం.శ్రీనివాసరావు దర్శించుకొని పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.