శివునికి నీటి కావిళ్లతో అభిషేకం
శివునికి నీటి కావిళ్లతో అభిషేకం
ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని జోలాపుట్టు ప్రాంతం మంగళవారం శివనామస్మరణతో హోరెత్తింది. గుప్తేశ్వర్లోని శైవ క్షేత్రానికి శివభక్తులు కాలినడకన నీటి కావిళ్లను తీసుకువచ్చి శివలింగానికి అభిషేకం చేశారు. పనసపుట్టు, బెజ్జంగి, గుర్రశెట్టి, సింధిగుడ, రాంగుడ తదితర ప్రాంతాలకు చెందిన భోల్భం భక్తులు 200 మంది శుక్రవారం ఉదయం జోలాపుట్టు జలాశయం నుంచి నీటిని కావిళ్లలో నింపుకొని బయలుదేరారు. మూడు రోజులపాటు 150 కి.మీ. కాలినడకన ప్రయాణం సాగించి సోమవారం గుప్తేశ్వర్ చేరుకుని పరమశివున్ని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో వారంతా లమతపుట్టు, మాచ్‌ఖండ్ జల విద్యుత్కేంద్రం, డుడుమ జలపాతాన్ని సందర్శించారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399