శిక్షణ ఫలాలు విద్యార్థులకు అందాలి
శిక్షణ ఫలాలు విద్యార్థులకు అందాలి
జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి
విద్యాశాఖ రూ.కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ఫలాలు వెనుకబడిన విద్యార్థులందరికీ అందించాలని జిల్లా
విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
అనకాపల్లి ఏఎంఏఏ ఉన్నత పాఠశాల, జేఎంజే పాఠశాలల్లో జరుగుతున్న ప్రధానోపాధ్యాయులు,
సైన్స్, గణిత ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ప్రతి తరగతిలోనూ శిక్షణ కార్యక్రమాలను తనిఖీ చేసి,
ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడారు. పాఠశాలల్లో సైన్స్ కిట్లు,
బోధన సామగ్రి తప్పనిసరిగా వినియోగించి బోధించాలని చెప్పారు.
పాఠ్య ప్రణాళికలు, డైరీలను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు.
పదోతరగతిలో ఈ ఏడాది పది గ్రేడ్పాయింట్లు జిల్లాలో కనీసం వెయ్యి మందికి వచే విధంగా ప్రధానోపాధ్యాయులు,
విద్యార్థులు కృషి చేయాలని కోరారు.
ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న సంఖ్యలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
ఇందులో ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.
పాఠశాలల నిర్వహణ, విద్యాభివృద్ధిలపై డయల్ యువర్ డీఈఓ కార్యక్రమాన్ని ప్రతి గురువారం నిర్వహించనున్నామన్నారు.
కేంద్ర బాధ్యుడు దువ్వూరి శ్రీనివాస్, డీఆర్పీలు రమేష్, జోగినాయుడు, రాజశేఖర్, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.