News

Realestate News

శబరిమలకు మహిళలూ వెళ్లొచ్చు


శబరిమలకు మహిళలూ వెళ్లొచ్చు

 

నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు

దిల్లీ: శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించొచ్చని స్పష్టంచేసింది.

పది నుంచి యాభై ఏళ్ల వయసు మహిళలపై ఉన్న నిషేధాన్ని కోర్టు ఎత్తేసింది.

ఆలయంలోకి మహిళ ప్రవేశాన్ని అడ్డుకుంటున్న ఆలయ నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 25ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది.

శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి మహిళల వయసుకు సంబంధించి నిబంధనలు విధించడాన్ని అత్యవసరమైన

మతపరమైన విధానంగా పరిగణించలేమని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఆలయాల్లో లింగ వివక్షకు తావు లేదని, మహిళలను తక్కువగా బలహీనులుగా చూడడానికి వీల్లేదని తీర్పు సందర్భంగా దీపక్‌ మిశ్ర పేర్కొన్నారు.

ఈ దేశంలో మహిళలను దేవతల రూపంలో పూజిస్తున్నామని, మరోవైపు లింగ వివక్షతతో ఆంక్షలు విధిస్తున్నామని తెలిపారు.

పురుషుల కంటే మహిళలు దేనిలోనూ తక్కువ కాదని అన్నారు. మహిళలపై నిషేధం హిందూ మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని పేర్కొన్నారు.

మతమనేది ప్రాథమిక జీవన విధానంలో భాగమని అన్నారు. మహిళల జీవ సంబంధ(బయోలాజికల్‌) లక్షణాల ఆధారంగా రాజ్యాంగ మార్పు ఉండబోదని వెల్లడించారు.

ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు ఈ తీర్పుతో అంగీకరించగా, ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించారు.

సతీసహగమనం లాంటి సామాజిక రుగ్మతలు మినహా మతపరమైన విధానాలను తొలగించే దానిపై నిర్ణయించే తీసుకునే అంశం కోర్టుకు సంబంధించినది కాదని ఆమె పేర్కొన్నారు.

దేశంలో లౌకిక వాతావరణాన్ని కల్పించేందుకు బలంగా నాటుకుపోయి ఉన్న మతపరమైన ఆచారాల్లో మార్పు చేయొద్దని అభిప్రాయపడ్డారు.

రుతుక్రమం వయసులోని (10 నుంచి 50ఏళ్లు) మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించొద్దని ఎన్నో ఏళ్లుగా నిబంధన ఉన్న సంగతి తెలిసిందే.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo