News

Realestate News

వ్యూహాత్మక సంబంధాల మెరుగుకు భారత్‌ కృషి

వ్యూహాత్మక సంబంధాల మెరుగుకు భారత్‌ కృషి
సింధియా, న్యూస్‌టుడే: విదేశాలతో వ్యూహాత్మక సంబంధాలను మెరుగు పర్చేందుకు భారత్‌ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల ఆరో తేదీన భారత్‌ నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్‌ శక్తి, ఐఎన్‌ఎస్‌ కమోర్తా యుద్ధనౌకలు రిపబ్లిక్‌ సింగపూర్‌కు చేరుకున్నాయని ఈస్ట్రన్‌ ఫ్లీట్‌ నేవీ వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక ఒప్పందంతో ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న చారిత్రాత్మక రక్షణ పరమైన విన్యాసాలు, పరస్పర అవగాహన తదితర అంశాలపై మూడు రోజులపాటు ఈ మూడు నౌకలు అక్కడ పాల్గొంటున్నాయి. సింగపూర్‌ హార్బర్‌లో ఉన్న నౌకలను సింగపూర్‌లో పాఠశాలల విద్యార్థులు, భారత సామాజిక వర్గాలు, వివిధ అంశాల్లో నిపుణులు భారత నౌకాదళ అధికారులతో మమేకం కాబోతున్నారు. మారిటైం విధానం అమలులో రిపబ్లిక్‌ సింగపూర్‌ నేవీ కమాండింగ్‌ అధికారి కల్నల్‌ ఎడ్విన్‌ లియాంగ్‌ బృందం భారత నేవీ బృందంతో సమావేశమైంది. భారత్‌ యాక్టు ఈస్ట్‌ పాలసీతో ఆగ్నేయాసియా దేశాల సరిహద్దు, సాగర జలాల్లో గస్తీ తదితర అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించనున్నట్లు నేవీ వర్గలు పేర్కొన్నాయి.