News

Realestate News

వైద్యసేవలు ప్రజలకు చేరువ చేయాలి ..


వైద్యసేవలు ప్రజలకు చేరువ చేయాలి

వైద్య, ఆరోగ్యశాఖ అదనపు సంచాలకులు వాణిశ్రీ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే:వైద్యసేవలు ప్రజలకు చేరువ చేయాలి

 అమలు చేస్తున్న ప్రతి వైద్యసేవ ప్రజలకు దగ్గర చేయాల్సిన బాధ్యత వైద్య సిబ్బందేనని వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్ర అదనపు డైరెక్టర్‌ వాణిశ్రీ తెలిపారు.

వైద్యశాఖ పనితీరుపై క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన ఆమె మండల కేంద్రంతోపాటు దొప్పెర్ల గ్రామంలో గురువారం ఆకస్మికంగా పర్యటించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులు, వైద్యశాఖ పరిధిలో అమలవుతున్న కార్యక్రమాలపై చెక్‌లిస్ట్‌ ఆధారంగా పరిశీలించిన ఆమె వైద్యాధికారి కనకమహాలక్ష్మి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, ప్రసూతి సేవలు, టీకాల కార్యక్రమం, కు.ని. శస్త్రచికిత్సలు, జ్వరాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.

అనంతరం మండలంలో దొప్పెర్ల గ్రామంలో పర్యటించి ఇంటింటా తిరుగుతూ వైద్య, ఆరోగ్యశాఖ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తుందీ పరిశీలించడానికి ప్రయత్నించారు.

జ్వరాల అదుపు మొదలు ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి శతశాతం ఉపయోగించుకునేలా సిబ్బంది పని చేయాలన్నారు.

వైద్య, ఆరోగ్య శాఖలో అలసత్వం ఉండకూడదని, ఎవరైనా విధులు నిర్వహించడంలో విఫలమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు.

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ మొదలు ఎన్టీఆర్‌ వైద్యసేవల వరకు అన్ని విషయాలపై క్షుణ్నంగా పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి జీవన్‌రాణి, సిబ్బంది ఎరుకునాయుడు, లండా అప్పలకొండ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.