News

Realestate News

వైభవంగా సుబ్రమణ్యస్వామి కల్యాణం

వైభవంగా సుబ్రమణ్యస్వామి కల్యాణం
సాయంత్రం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. తొలుత స్వామి దేవేరులను రథంపై అధిష్ఠింపచేసి రథోత్సవం నిర్వహించారు. అనంతరం అసురవధ కార్యక్రమాన్ని జరిపించారు. పీఠంలోని ఉత్సవ వేదికపై స్వామి, అమ్మవార్లను ప్రతిష్ఠింపచేసి పరిణయ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలు, బాణసంచా కాల్పులు ఆకట్టుకున్నాయి. యువతీ యువకులు అధిక సంఖ్యలో కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. మంగళవారం పూర్ణాహుతితో వార్షికోత్సవాలు ముగుస్తాయి.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo