వైద్యహబ్కు 204 ఎకరాల కేటాయింపు

మదీనాబాగ్(పెదగంట్యాడ), న్యూస్‌టుడే: సర్వే నెంబర్ 176లో వైద్య హబ్ నిర్మాణానికి కేటాయించిన స్థ´లాన్ని శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పరిశీలించారు. సుమారు 204 ఎకరాలు వైద్య హబ్‌కు కేటాయించినట్లు ఆమె తెలిపారు. మనదేశంతోపాటు అమెరికా, ఆసియా దేశాలు ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేస్తాయన్నారు. థర్మామీటర్ నుంచి సిటీస్కాన్, ఎక్సరే, సిరంజీలు, శస్త్రచికిత్సకు ఉపయోగించే అన్ని రకాల పరికరాలు ఇక్కడ తయారవుతాయన్నారు. జిల్లా కలెక్టర్ యువరాజ్ స్థలం కేటాయింపుల గురించి ఆమెకు వివరించారు. వైద్యహబ్ సీఈఓ జితేందర్ శర్మ మాట్లాడుతూ సంస్థలకు అవసరమైన పూర్తి ముడిసరకు ఇక్కడ లభ్యమయ్యేలా చూస్తామన్నారు. విద్యుత్, స్థలం చుట్టూ ప్రహరీ, ఇతర సౌకర్యాలను త్వరితగతిన కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.