వెలుగులోకి అల్లూరి గుహ జాగాలమామిడిలో రక్షణ ప్రాంతంగా వినియోగించిన సేన
గూడెంకొత్తవీధి, న్యూస్టుడే: ఆంగ్లేయుల పాలనను ధిక్కరించి స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు, అతడి సేన వినియోగించిన పురాతన గుహ గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల సరిహద్దులో బయటపడింది. ఎత్తయిన కొండలో పెద్దబండరాయి కింద ఈ గుహ ఉంది. దీనిని డొకులూరు గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్ధి గబులంగి రమణ వెలుగులోకి తీసుకువచ్చారు. గూడెంకొత్తవీధి మండలం డొకులూరు నుంచి కొయ్యూరు వైపు అడవి మార్గంలో వెళ్తే రెండున్నర కిలోమీటర్ల దూరంలో పెద్ద రాతికొండ ఉంది. దానిపై పెద్ద రాయి కింద గుహ ఉంది. ఈ గుహ వద్ద చుట్టూ రాతికట్టుతో గోడ నిర్మితమై ఉంది. స్వాతంత్య్ర పోరాట సమయంలో అల్లూరి సీతారామరాజు, గాం మల్లుదొర, గాం గంటన్నదొర, వీరయ్యదొర, గోకిరి ఎర్రేసు, పండుపడాల్, అగ్గిరాజు వంటి విప్లవ వీరులు కొయ్యూరు, మంప ద్వారా రాజవొమ్మంగి, అడ్డతీగల రంపచోడవరం వైపు వెళ్లేందుకు ఈ ప్రాంతం మీదుగానే రాకపోకలు సాగించేవారని డొకులురు గ్రామానికి గ్రామపెద్దలు చెబుతున్నారు. జగాల మామిడి కొండగా పిలిచే ఈ గుహను వారు రక్షణ ప్రాంతంగా (షెల్టర్) ఉపయోగించినట్లు వారు చెబుతున్నారు. ఈ గుహ వద్ద లోపల ఉన్నవారు కనబడకుండా వారు రాతిగోడ నిర్మించినట్లు వారు చెబుతున్నారు. ఈ గుహలో ఎలుగుబంట్లు ఉన్నాయని ప్రచారం జరగడంతో దీనిని చేరేందుకు ఎవరూ సాహసించే వారు కాదు.
Source : http://www.eenadu.net/
Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399