News

Realestate News

వెనకాల కూర్చున్నా.. శిరస్త్రాణం ధరించాల్సిందే

వెనకాల కూర్చున్నా.. శిరస్త్రాణం ధరించాల్సిందే
నిబంధన నేటి నుంచి పక్కాగా
అమలు పాటించకపోతే జరిమానా
న్యూస్‌టుడే, పూర్ణామార్కెట్‌
మొదటిసారి పట్టుబడితే…వాహనం నడుపుతున్న వ్యక్తి శిరస్త్రాణం ధరించకపోతే… రూ. 100 జరిమానా, రూ. 35 బ్యాంకు ఛార్జి. మొత్తం రూ. 135
వాహనం వెనక కూర్చున్న  వ్యక్తికి శిరస్త్రాణం లేకపోతే..  జరిమానా రూ. 100.
రెండోసారి పట్టుబడితే… వాహనం నడుపుతున్న వ్యక్తి  శిరస్త్రాణం ధరించకపోతే.. జరిమానా రూ. 200, బ్యాంకు ఛార్జి రూ. 35. మొత్తం రూ. 235
వెనక కూర్చున్న వ్యక్తి శిరస్త్రాణం ధరించకపోతే.. రూ. 200 అంటే.. మొత్తం: రూ. 435
వాహనం నడుపుతున్న వ్యక్తికి శిరస్త్రాణం ఉండి.. వెనక కూర్చున్న వ్యక్తికి లేకపోతే..జరిమానా రూ. 100.
పోలీసులతో అనుచితంగా ప్రవర్తిస్తే  మరో రూ. 100
గరంలో ద్విచక్రవాహనాలపై వెనక కూర్చున్నవారు కూడా తప్పనిసరిగా శిరస్త్రాణం (హెల్మెట్‌) ధరించాల్సిందే. ఈ నిబంధన శుక్రవారం నుంచి అమల్లోకి వస్తోంది. ఈ నిబంధన పాటించనివారి నుంచి ట్రాఫిక్‌ పోలీసులు రూ. 100 జరిమానా వసూలు చేయనున్నారు. ఈ మేరకు నగర ట్రాఫిక్‌ ఏడీసీపీ ఎం. రమేష్‌కుమార్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
నగరవ్యాప్తంగా శుక్రవారం నుంచి ట్రాఫిక్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. ఇంతకాలం వాహనం నడుపుతున్న వ్యక్తి శిరస్త్రాణం ధరించాడా? లేదా? అన్నదే పరిశీలించిన పోలీసులు ఇక నుంచి.. బండి సీబుక్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బీమా, కాలుష్య ధ్రువీకరణపత్రాలను కూడా తనిఖీ చేయనున్నారు. దాంతోపాటే వాహనం వెనకాల కూర్చున్న వ్యక్తులు సైతం శిరస్త్రాణం ధరించకపోతే జరిమానా వసూలు చేయనున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు నగర పరిధిలో ద్విచక్ర వాహన ప్రమాదాలు భారీగా నమోదైన నేపథ్యంలో ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.

చట్టం అమలు ఇలా…
కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 129, ఆంధ్రప్రదేశ్‌ మోటారు వాహనాల చట్టం సెక్షన్‌ 437 ప్రకారం నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు.
వాహనంపై ఇద్దరు వెళితే.. తప్పనిసరిగా ఇద్దరూ శిరస్త్రాణం ధరించాల్సిందే. ఈ మేరకు ఈ-చలానా యాప్‌లో సైతం నిబంధనలను మార్చారు.
శుక్రవారం ఉదయం నుంచే నగరవ్యాప్తంగా ట్రాఫిక్‌ సిబ్బంది సెల్‌ఫోన్లలో కొత్త జరిమానా నిబంధనలు అందుబాటులో ఉంటాయి.
వాహనం నడుపుతున్న వ్యక్తి, వెనక కూర్చున్న వ్యక్తి సెల్‌ఫోన్లకు నిబంధనలను అతిక్రమణకు సంబంధించి సంక్షిప్త సందేశాలు, ఈ-చలానా వెళతాయి. జరిమానాను వాహన అసలు యజమాని లేదా వాహనాన్ని నడిపిన వ్యక్తి లేదా.. వెనకాల కూర్చున్న వ్యక్తి.. ఎవరైనా చెల్లించవచ్చు.
పోలీసులు తనిఖీ చేస్తున్నపుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది వాహనాలను నడిపించుకుంటూ.. తొక్కుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇలాంటివారినీ ఉపేక్షించేది లేదని  రమేష్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ప్రమాదాలను నివారించేందుకే….
మరోవైపు కార్లు, ఆటోల విషయంలోనూ ట్రాఫిక్‌ సిబ్బంది కఠినంగా వ్యవహరించనున్నారు. ఆటోలను డ్రైవర్లు ఇష్టారాజ్యంగా నడిపినా, రహదారులపై నిలిపేసినా, పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్నా, సౌండ్‌ బాక్స్‌లను వినియోగించినా, ఏకరూప దుస్తులు ధరించకపోయినా, ఆటోలో యజమాని, డ్రైవర్‌ వివరాలతో కూడిన పత్రాలు ప్రదర్శించకపోయినా జరిమానాలు విధిస్తామని రమేష్‌కుమార్‌ హెచ్చరించారు.
కార్ల అద్దాలకు నలుపు రంగు ఫిల్మ్‌ వాడకపోయినా, సీటు బెల్ట్‌ ధరించకపోయినా, ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించినా జరిమానాలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తామని వివరించారు.
నగర పరిధిలో రహదారి ప్రమాదాలను నివారించేందుకే కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo