News

Realestate News

వీపీటీలో అగ్నిమాపక కేంద్రం ప్రారంభం

వీపీటీలో అగ్నిమాపక కేంద్రం ప్రారంభం
మహారాణిపేట, న్యూస్‌టుడే: విశాఖ ఓడరేవు(వీపీటీ) అధునాతన అగ్నిమాపక కేంద్రాన్ని గురువారం ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు ప్రారంభించారు. దీనిని రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో అత్యాధునిక అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచారు. రూ. 93.70 లక్షలతో ఆపరేషనల్‌ అండ్‌ నిర్వహణ కార్యాలయాన్ని, డిశ్పాచ్‌ యార్డును ప్రారంభించారు. ఛైర్మన్‌ కృష్ణబాబు మాట్లాడుతూ దేశంలోని అన్ని ఓడరేవుల్లోకెల్లా అగ్నిమాపక కేంద్రం అధునాతనమైనదన్నారు. ఇటీవల కాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ఛైర్మన్‌ పీఎల్‌ హరనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.