News

Realestate News

విస్తరణ పనులకు శ్రీకారం

విస్తరణ పనులకు శ్రీకారం

గవరపాలెం(అనకాపల్లి), న్యూస్‌టుడే(Expansion work commences): నూకాలమ్మ రహదారి విస్తరణ పనులకు ఎట్టకేలకు గురువారం శ్రీకారం చుట్టారు. స్థానిక శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ పనులను పరిశీలించారు. విస్తరణకు సహకరిస్తున్న స్థానికులను కలిసి అభినందించారు. నూకాలమ్మ జాతర లోపు విస్తరణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. జాతీయ రహదారిలోని నూకాలమ్మ ఆర్చి నుంచి ఆదివారం సంత, కోవెల, ఫూల్‌బాగ్‌ మీదుగా పూడిమడక రహదారి కూడలి వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని 60 అడుగులకు విస్తరిస్తామని పేర్కొన్నారు.

రహదారి నిర్మిణానికి రూ.5 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ నిధులు వుడా మంజూరు చేసిందన్నారు. దాదాపు 190 నిర్మాణాలు తొలగిస్తామని.. వీరందరికీ పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా కోల్పోయిన స్థలం విస్తీర్ణానికి రెండు రెట్లు టీడీఆర్‌ పత్రాలు ఇస్తామని తెలిపారు. జీవీఎంసీ ప్రణాళిక విభాగం అధికారి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నేతలు బి.ఎస్‌.ఎం.కె.జోగినాయుడు, మళ్ల సురేంద్ర, ఆడారి జగన్నాథరావు పాల్గొన్నారు.