News

Realestate News

విశ్వవిద్యాలయాలు.. పరిశ్రమల భాగస్వామ్యం మానవాళికి ఉపయుక్తం

universities and industry that serves humanity,vizag,vizagrealestate

అమెరికన్‌ ప్రతినిధి ఆంటోని
ఏయూ ప్రాంగణం: విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల భాగస్వామ్యం విశ్వమానవాళికి ఎంతో ఉపయుక్తం అవుతుందని అమెరికాకు చెందిన ఆంటోని పేర్కొన్నారు. అమెరికాదేశ యూనివర్సిటీ ఇండస్ట్రీ డిమానిస్టేష్రన్‌ పార్ట్నర్‌షిప్‌ అధ్యక్షులైన ఆంటోని ఎం.బెకన్‌పుసో భారÅ దేశ పర్యటనలో భాగంగా శనివారం విశాఖ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏయూ సెనేటü హాలులో అధికారులు, ప్రధాన ఆచార్యులు, డీన్‌లుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంటోని మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు జరిపే పరిశోధనలకు పరిశ్రమలు నిధులను సమకూర్చాలన్నారు. పరిశోధనల ఫలితాలను సీÔ్వకరించి పరిశ్రమలు ఆ అంశాలను కార్యరూపంలోనికి తీసుకురావాలన్నారు. బిజినెస్‌ స్కూల్స్‌, ఇంజినీరింగ్‌, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ రంగాలు సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.. భారతీయ విద్యార్థులు అమెరికా, చైనా, జర్మనీ దేశాల విద్యార్థులతో పోటీ పడుతూ పనిచేయాలన్నారు. విశ్వవిద్యాలయాలు తమ విశిష్ఠతలను పరిశ్రమలకు తెలియజేయాలని, పరిశ్రమలు సవాల్‌గా తీసుకొని అవసరమైన సహకారాన్ని విశ్వవిద్యాలయాలకు అందించాలని కోరారు. విద్యార్థులే భవిష్యత్తు అన్న అంశం గుర్తు చేసుకుంటూ పనిచేయాలన్నారు. పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు చర్చించుకుంటూ పనిచేసేందుకు ఒక ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేయాలని ఆంటోని సూచించారు. అమెరికన్‌ కాన్సులేటü జనరల్‌ పబ్లిక్‌ ఎఫైర్స్‌ అధికారి గాబ్రియేల్‌ హాన్స్‌ ఓలివర్‌ మాట్లాడుతూ నిపుణులు మేథస్సును పరస్పరం పంచుకోవడం మంచిదన్నారు. అమెరికాకు చెందిన నిపుణలను ఏయూకు తీసుకువస్తామన్నారు. రవాణా, కాలుష్యం వంటి సమస్యలకు పరిష్కారాలను అందించడంలో పరస్పర సహకారం పొందడం అవసరమన్నారు. ఏయూ ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు మాట్లాడుతూ స్మార్ట్‌ సిటీ నిర్మాణంలో భాగంగా విశాఖను సందర్శించిన నిపుణులు ఏయూలో మేథో చర్చలు జరుపుతున్నారన్నారు. ఏపీÔ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షులు జి.సాంబశివరావు, ఏయూ ఇంటర్నేషనల్‌ డీన్‌ ఆచార్య బి.మోహన్‌వెంకటరామ్‌, ఆచార్యులు బాలప్రసాద్‌, రిజిస్ట్రారు ఆచార్య ఉమామహేశ్వరరావు, ప్రధాన ఆచార్యులు సి.వి.రామన్‌, సి.హెచ్‌.రత్నం, గౌరీశంకర్‌, డి.సూర్యప్రకాశరావు, పి.ఎస్‌.అవధాని తదితరులు పాల్గొన్నారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo