News

Realestate News

విశాఖ స్టేషన్‌ అభివృద్ధికి మరిన్ని చర్యలు

విశాఖ స్టేషన్‌ అభివృద్ధికి మరిన్ని చర్యలు
రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించినట్టుగానే అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కార్యక్రమాన్ని బుధవారం దిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో అన్ని రైల్వే జోన్‌, డివిజనల్‌ మేనేజర్లతో వీడియో కాన్ఫిరెన్సులో మాట్లాడారు. మొదటి విడతగా 23 ప్రధాన స్టేషన్ల పునరాభివృద్ధి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలో 400లకు పైగా ఏ1, ఏ కేటగిరీ స్టేషన్లను పునరాభివృద్ధికి ఎంపిక చేయాల్సి ఉండగా మొదటివిడతలో 23 స్టేషన్లను ఎంపిక చేశారు. దీంట్లో తూర్పు కోస్తా జోన్‌ వాల్తేర్‌ డివిజన్‌ నుంచి విశాఖ రైల్వేస్టేషన్‌ ఎంపికైంది. వాల్తేర్‌ డివిజన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ అనంతరం విలేకర్లతో మాట్లాడారు.

కేంద్రం నిర్ణయం ప్రకారం త్వరలో విశాఖ రైల్వేస్టేషన్‌ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నవశోభను సంతరించుకుంటుందన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్నట్లు తెలిపారు. జ్ఞానాపురం వైపు ఖాళీగా ఉన్న రైల్వే స్థలంలో పలు సదుపాయాలు కల్పిస్తామన్నారు. రెండు దశల్లో బిడ్డింగ్‌లు ఆహ్వానించి గుత్తేదారులను ఎంపిక చేస్తామన్నారు. అత్యాధునిక సదుపాయాలతో లాంజ్‌లు, మల్టీ కాంప్లెక్స్‌లు సమకూర్చాల్సి ఉంటుందన్నారు. వాటి నిర్మాణాలే కాకుండా నిర్వాహణ బాధ్యతులు సైతం లీజుదారులే వహించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జి.వి.ఎం.సి కమీషనర్‌ హరినారాయణన్‌ మాట్లాడుతూ ఆకర్షణీయ నగరంగా రూపొందుతున్న విశాఖలో రైల్వే స్టేషన్‌ అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే అవకాశం రావడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో కమర్షియల్‌ మేనేజర్‌ కోఆర్డినేషన్‌ సునీల్‌కుమార్‌తో పాటు పలు పబ్లిక్‌, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo