విశాఖ స్టేషన్లో సౌర విద్యుత్‌కు బాటలు
విశాఖ స్టేషన్లో సౌర విద్యుత్‌కు బాటలు
రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: విశాఖ రైల్వేస్టేషన్ పరిధహలో సౌర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని డీఆర్ఎం ఎం.ఎస్.మాథుర్ అన్నారు. వాల్తేర్ డీఆర్ఎం కార్యాలయం పైకప్పు ప్రాంతంతో పాటు డీజిల్ లోకోషెడ్, విద్యుత్ లోకోషెడ్, రైల్వే ఆసుపత్రి శ్లాబ్‌లపై ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ వ్యవస్థ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. రూ. 8 కోట్ల వ్యయంతో పనులు చేపట్టామన్నారు. ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తికి 16,250 చదరపు మీటర్లు ప్రదేశంలో 3,360 సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశామన్నారు. దీనిద్వారా నిత్యం 3,600 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలిపారు.