News

Realestate News

విశాఖ పర్యాటకానికి ప్రపంచ ఖ్యాతి

విశాఖ పర్యాటకానికి ప్రపంచ ఖ్యాతి
ఈనాడు, విశాఖపట్నం: విశాఖ తీరంలో ఈ నెల 29 నుంచి ఏప్రిల్‌ 1 వరకు నిర్వహిస్తున్న వైజాగ్‌ యాటింగ్‌ ఫెస్టివల్‌తో పర్యాటకానికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కనుందని రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని ఫిషింగ్‌ హార్బర్‌లోని డ్రైడాక్‌ జట్టీలో వేడుక ఏర్పాట్లను బుధవారం సాయంత్రం పరిశీలించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా యాటింగ్‌ ఫెస్టివల్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. తొమ్మిది పడవలు రుషికొండ, యారాడ, తొట్లకొండ, భీమిలి మార్గాల్లో ప్రయాణిస్తాయన్నారు.

స్థలాభావం వల్ల రోజుకు 110 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల పట్ల ఆన్‌లైన్‌లో లక్ష మందికిపైగా ఆసక్తి చూపారని.. ఆన్‌లైన్‌ పోటీల్లోనూ పాల్గొనేందుకు ముందుకు వస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో పర్యాటక ప్రోత్సాహంలో భాగంగా మిలీనియం ఒలింపియాడ్‌ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏర్పాట్లు, భద్రత అంశాలపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాకుడు శ్రీనివాసన్‌, నగర పోలీసు కమిషనర్‌ టి.యోగానంద్‌ తదితరులతో చర్చించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావివ్వవద్దని ఈ- ఫ్యాక్టర్స్‌ ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి పూర్ణిమాదేవి, జీవీఎంసీ కమిషనర్‌ ఎం.హరినారాయణన్‌ పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo