News

Realestate News

విశాఖ నగరికి మరో మణిహారం

విశాఖ నగరికి మరో మణిహారం
నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా గురజాడ కళాక్షేత్రం ప్రారంభం
విశాఖపట్నం, న్యూస్‌టుడే :  విశాఖ నగర సిగలో మరో కలికితురాయి చేరింది. విశాఖ సంస్కృతి, సౌరభాలను విలసిల్లేలా చేసే గురజాడ కళాక్షేత్రం హుద్‌హుద్‌కు దెబ్బతింది. ఈ కళాక్షేత్రాన్ని రూ.9.50 కోట్లతో పునర్నిర్మాణం చేశారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన జరిగిన గురజాడ కళాక్షేత్రం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. సిరిపురం కూడలిలో వుడా ప్రధాన కార్యాలయానికి ఎదురుగా వున్న గురజాడ కళాక్షేత్రం హుద్‌హుద్‌ తుపాను ధాటికి పాడైంది. దీని పైకప్పు పూర్తిగా పాడవడంతో పాటు దారుణంగా తయారైంది. పునర్నిర్మాణంలో భాగంగా పైకప్పును పాలికార్బనేట్ షీట్తో నిర్మించారు. హెచ్‌డీపీ  ప్లాస్టిక్‌ కుర్చీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక దీపాలంకరణ చేశారు. అతి పెద్ద ఫ్యాన్లు అమర్చారు. ప్రత్యేక శబ్ధ విధానంతో బహిరంగ ఆడిటోరియంగా నిర్మించారు. తుపాను ధాటికి దెబ్బతినక ముందు కళాక్షేత్రం 2,500 వీక్షించేందుకు వీలుగా ఉండేది. దీనిని నేడు 2,300 మంది కూర్చునేలా కుర్చీలు అమర్చి అందుబాటులోనికి తెచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం కళా క్షేత్రాన్ని ప్రారంభించనున్నారు. వుడా పూర్వ వీసీ, కడప కలెక్టర్‌ బాబూరావునాయుడు మంగళవారం గురజాడ కళాక్షేత్రాన్ని సందర్శించారు. కళాక్షేత్రం లోపలి భాగం ఎలా నిర్మించింది ఆయన పరిశీలించారు.