విశాఖ-తిరుపతి మధ్య ప్రత్యేక తత్కాల్ రైలు

విశాఖ-తిరుపతి మధ్య ప్రత్యేక తత్కాల్ రైలు
రైల్వేస్టేషన్, న్యూస్టుడే: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నం-తిరుపతి మధ్య ఐదు ట్రిప్పుల తత్కాల్ ప్రత్యేక రైలు నడపనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజనల్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ యల్వేందర్ యాదవ్ తెలిపారు.
* విశాఖపట్నం-తిరుపతి(08573): ఈ రైలు నవంబరు 28 నుంచి డిసెంబరు 26 వరకూ ప్రతి సోమవారం రాత్రి 10.55 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
* తిరుపతి-విశాఖపట్నం(08574): ఈ రైలు నవంబరు 29 నుంచి డిసెంబరు 27వ తేదీ వరకూ ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతితో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
* ఈ రైలుకు ఒక సెకెండ్ ఏసీ, 3 థర్డ్ ఏసీ, 9 స్లీపర్ క్లాస్, 6 సాధారణ రెండో తరగతి, 2 రెండో తరగతి కమ్ లగేజి బోగీలతో ఈ ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, ఒంగోలు నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ఆయా రోజుల్లో ఉండే విశాఖ-తిరుపతి-విశాఖ ప్రత్యేక సువిధ రైళ్లను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.